మ‌రోసారి చిరు టైటిల్‌ని వాడుకున్న కార్తి

Sat,November 16, 2019 08:11 AM

త‌మిళ స్టార్ హీరో సూర్య సోద‌రుడు కార్తి తొలి సారి త‌న వ‌దిన జ్యోతిక‌తో క‌లిసి ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సమర్పణలో ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై సూరజ్‌ సదానా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. త‌మిళంలో తంబి అనే టైటిల్‌తో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి తెలుగులో దొంగ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.


కార్తి రీసెంట్‌గా ఖైదీ అనే చిత్రంతో మంచి హిట్ కొట్ట‌గా, ఈ మూవీతో తొలిసారి వంద కోట్ల క్ల‌బ్‌లో చేరారు. అయితే ఖైదీ చిత్రం చిరు కెరీర్‌ని మ‌లుపు తిప్పిన చిత్రం కాగా, అదే టైటిల్‌తో వ‌చ్చిన మ‌రో ఖైదీ కూడా మంచి విజ‌యం సాధించ‌డం విశేషం. ఇప్పుడు కార్తి మ‌రోసారి చిరు టైటిల్‌ని వాడుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఖైదీ త‌ర్వాత చిరు చేసిన చిత్రం దొంగ‌. ఇప్పుడు దొంగ‌గా కార్తీ కూడా అల‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు. మ‌రి ఈ చిత్రం కూడా కార్తికి మంచి విజ‌యం అందిస్తుందా అనేది చూడాలి.

2249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles