చెర్రీ సినిమా నుండి 'తందానే తందానే' సాంగ్‌..

Sat,December 1, 2018 12:34 PM
Thandaane Thandaane first lyrical song out on monday

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 12వ చిత్రంగా బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విన‌య విధేయ రామ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు . దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్నాడు. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించి చివ‌రిగా టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు పెంచింది. ఇందులో మాస్ డైలాగ్స్ ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే డిసెంబ‌ర్ 3 సాయంత్రం 4గం.ల‌కి చిత్రం నుండి తందానే తందానే అనే సాంగ్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ సాంగ్ ఫ్యామిలీ సాంగ్‌గా అర్థ‌మవుతుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన మిగ‌తా స్వ‌రాల‌ని కూడా ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్నారు. . రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయం అంటున్నారు. ఈ సినిమాతో పాటు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ మ‌ల్టీ స్టార‌ర్ కూడా చేస్తున్నాడు చ‌ర‌ణ్‌. ఈ మూవీలో చెర్రీ పాత్ర చాలా ప‌వర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది.

2564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles