ఫ‌స్ట్ సాంగ్‌తో దుమ్మురేపిన చెర్రీ

Tue,December 4, 2018 08:05 AM
Thandaane Thandaane Song With Lyrics

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో చెర్రీ త‌న 12వ చిత్రంగా చేస్టున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విన‌య విధేయ రామ . దానయ్య డీవీవీ నిర్మిస్తున్నఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్నాడు. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ఆ మ‌ధ్య చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు పెంచింది. ఇందులో మాస్ డైలాగ్స్ ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇక తాజాగా తందాన తందాన అంటూ సాగే సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఉత్స‌వాల‌కి సంబంధించిన నేప‌థ్యంలో సాగే ఫ్యామిలీ సాంగ్‌గా తెలుస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన మిగ‌తా స్వ‌రాల‌ని కూడా ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్నారు. . రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయం అంటున్నారు. ఈ సినిమాతో పాటు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ మ‌ల్టీ స్టార‌ర్ కూడా చేస్తున్నాడు చ‌ర‌ణ్‌. ఈ మూవీలో చెర్రీ పాత్ర చాలా ప‌వర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది.

2399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles