రెండో సినిమాకి సిద్ధమైన పెళ్లి చూపులు డైరెక్టర్

Tue,May 16, 2017 05:25 PM
Tharun Bhascker complets his second script

విజయ్‌దేవరకొండ, రీతూ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘పెళ్లిచూపులు’ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్‌ హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖుల ప్రశంసలు లభించగా, ఇటీవల నేషనల్ అవార్డు గెలుచుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలు భాషలలో రీమేక్ అయ్యేందుకు కూడా రెడీ అవుతుంది. అయితే పెళ్ళి చూపులు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన తరుణ్ భాస్కర్ కొన్నాళ్ళుగా రెండో సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు. త్వరలో ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టి వీలైనంత త్వరలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని ఈ దర్శకుడు భావిస్తున్నాడు. సినిమాలోని నటీనటులు,టెక్నీషియన్స్ వివరాలను కూడా త్వరలో వెల్లడించనున్నారు.

2207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles