యూ ట్యూబ్‌లో ‘తస్సాదియ్యా..’ సాంగ్ వైబ్రేష‌న్స్

Tue,December 18, 2018 08:16 AM
Thassadiyya Song With Lyrics

బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం విన‌య విధేయ రామ‌. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. తాజాగా చిత్రానికి సంబంధించి ‘తస్సాదియ్యా..’ అంటూ సాగే డ్యూయ‌ట్ సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఈ పాట‌ని జ‌స్ప్రీత్ జాజ్‌, మాన‌సి ఆల‌పించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ఆక‌ట్టుకునేలా ఉంది. స్నేహా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, అనన్య, ఆర్యన్‌ రాజేష్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ భామ ఈషా గుప్తా ఇందులోని ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు. యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం మిలియ‌న్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్ట‌డంతో పాటు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా ఉంది. మ‌రి తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

2209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles