గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ నుండి ఎమోష‌న‌ల్ డిలీటెడ్ సీన్

Tue,October 1, 2019 08:38 AM

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళు రాబ‌డుతుంది. తాజాగా చిత్రం నుండి ఎమోష‌న‌ల్ డిలీటెడ్ సీన్ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో పూజా ఊరు వ‌దిలి పారిపోదామ‌ని వ‌రుణ్‌ని బ్ర‌తిమిలాడుతుండ‌గా, ఆయ‌న ఊరు వ‌దిలి వెళ్ళేదే లేదంటూ ఖ‌రాఖండీగా చెబుతుంటాడు. ఈ ఎమోష‌న‌ల్ సీన్‌ని చిత్రం నుండి తొల‌గించిన చిత్ర బృందం రీసెంట్‌గా యూట్యూబ్‌లో విడుద‌ల చేసింది. ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన 'గద్దలకొండ గణేష్‌' చిత్రంలో అథ‌ర్వ ముర‌ళి ముఖ్య పాత్ర పోషించారు. పూజా హెగ్డే, మృణాలినీ ర‌వి క‌థానాయిక‌లుగా న‌టించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.


3852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles