దీపావ‌ళి బాంబ్ పేల్చిన వ‌ర్మ‌ -ట్రైల‌ర్

Sun,October 27, 2019 09:43 AM

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ చివ‌రిగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఇక తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా చేస్తున్నాడు . చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్‌ను బట్టి చూస్తే రెండు సామాజిక వర్గాల మధ్య నడిచే కథ ఇదని అనుకుంటారు. కాని అందులో నిజం లేదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపథ్యంలో కథ సాగుతుంది అని మేక‌ర్స్ అంటున్నారు. కాక‌పోతే సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న వివాదాస్పద అంశాల్ని స్పృశిస్తూ రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. వ‌ర్మ వాయిస్‌తో ట్రైల‌ర్ మొద‌లు కాగా, ఇందులోని స‌న్నివేశాల‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలు ఎలా మారాయో చూపించిన‌ట్టు తెలుస్తుంది. మీరు ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి.

2858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles