మ‌రికొద్ది గంట‌ల‌లో ‘టైగర్ కేసీఆర్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,April 20, 2019 09:47 AM
The First Look of  TIGER KCR will be out today at 11 Am

ఒక‌ప్పుడు అద్భుత‌మైన చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న వ‌ర్మ ప్ర‌స్తుతం బయోపిక్‌ల బాట ప‌ట్టాడు. ఇటీవ‌ల లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన వ‌ర్మ ప్ర‌స్తుతం తాను రెండు బ‌యోపిక్‌ల‌ని రూపొందించే ప‌నిలో ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌తో ఓ బయోపిక్ చేస్తుండ‌గా, ‘శశికళ’ పేరుతో కూడా బ‌యోపిక్ రూపొందిస్తున్నాడు . అయితే కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని ఎలా న‌డిపించారు అన్న నేప‌థ్యంలో వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న టైగ‌ర్ కేసీఆర్ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల టైటిల్ లోగో విడుద‌ల చేశారు. టైటిల్‌కి అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు. ఇక ఈ రోజు ఉద‌యం 11గం.లకి చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. అంతేకాదు ఈ సినిమాలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత, హరీశ్ రావు, వైఎస్సార్, జగన్, చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎంలు రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, నారా లోకేశ్ ఉంటారని తెలిపారు. కేసీఆర్ పాత్ర‌లో రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి చిత్రాల‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన మ‌హేష్‌ని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. వ‌ర్మ సినిమాలు ఎలా ఉన్నా పాత్ర‌ల‌లో ఇమిడిపోయే న‌టీన‌టుల‌ని ఎంపిక చేయ‌డం వ‌ర్మ స్పెషాలిటీ.2088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles