బిగ్ బాస్3: ఈ వారం నామినేష‌న్స్‌లో ల‌వ్ బ‌ర్డ్స్‌

Wed,October 2, 2019 08:11 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 ప‌ద‌కొండో వారంలో నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ‘రాళ్లే రత్నాలు’ అనే టాస్క్ లో భాగంగా ఆకాశం నుండి 20, 50, 100, 200 విలువ కలిగిన రాళ్ల వర్షం కురుస్తుంటుంది. ఫైనల్‌గా ఎవరు ఎక్కువ విలువ కలిగిన రాళ్లను సొంతం చేసుకుంటే.. వాళ్లే ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు. తక్కువ ఉన్నవాళ్లు నామినేట్ అవుతారు. ఇప్ప‌టికే రాహుల్ నామినేట్ కాగా, ఆయ‌న‌తో పాటు పున‌ర్న‌వి, మ‌హేష్, వ‌రుణ సందేశ్ నామినేట్ అయ్యారు


మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎపిసోడ్ 73లో అలుపు లేకుండా టాస్క్ ఆడారు ఇంటి స‌భ్యులు. ఫిజిక‌ల్ టాస్క్ అయిన‌ప్ప‌టికి ఎలాంటి గొడ‌వ‌లు లేకుండానే టాస్క్ ముగిసింది. రాళ్ళు కురుస్తున్న స‌మ‌యంలో వ‌రుణ్ ముక్కుకి బుట్ట త‌గిలి బ్లీడింగ్ కావ‌డం, వితికా రాళ్ళ‌ని బాబా భాస్క‌ర్ గుంజుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే స‌మ‌యంలో ఆమె ఫైర్ కావ‌డం వంటివి జరిగాయి. అయితే వితికా అరుస్తున్న స‌మయంలో వ‌రుణ్ ఆమెని కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఇది ఫిజిక‌ల్ టాస్క్ ఇలానే ఉంటుంది. ఆడ‌లేక‌పోతే ప‌క్క‌కి వెళ్లి కూర్చో అని గ‌ట్టిగా అరిచాడు.

వాళ్ళ‌ని అంటుంటే నీ కెందుకు కోపం వ‌స్తుంది.. మాట్లాడితే గేమ్ మానేయ్ అంటూ వరుణ్‌పై అలిగింది వితికా. కొద్ది సేప‌టి త‌ర్వాత ఆమె ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి .. నా మీద ఫీల్ అయ్యావా అంటూ వితికాను గట్టిగా హ‌గ్ చేసుకున్న‌నాడు వరుణ్. ‘అబ్బా.. వదులు వరుణ్.. ఓవరాక్షన్ చేయకు వదులు’ అంటూ బుంగమూతి పెట్టింది వితికా. ఇలా కొద్ది సేప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రి రొమాంటిక్ మూడ్‌లో ఉండిపోయారు. అయితే 11వ వారంలో బిగ్ బాస్ ప్రేమ‌జంట రాహుల్, పున‌ర్న‌వి నామినేష‌న్‌లో ఉండ‌డంతో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

కొద్ది రోజుల క్రితం ఫేక్ ఎలిమినేష‌న్‌లో భాగంగా రాహుల్‌ని ఇంటి నుండి బ‌య‌ట‌కి పంప‌గా, పున‌ర్న‌వి చాలా ఫీల్ అయిన విష‌యం విదిత‌మే .మ‌ధ్య మ‌ధ్య‌లో రాహుల్‌ని త‌ల‌చుకుంటూ క‌న్నీళ్ళు కూడా పెట్టుకుంది. మ‌రి ఈ వారం ల‌వ్ బ‌ర్డ్స్‌ని బిగ్ బాస్ సేవ్ చేస్తాడా లేక ఒక‌రిని ఇంటి నుండి బ‌య‌ట‌కి పంపి గేమ్‌ని మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వారం నామినేష‌న్‌లో ఉన్న న‌లుగురిలో మహేష్ విట్టా, రాహుల్ కాస్త వీక్ కంటెస్టెంట్స్ కాగా, వ‌రుణ్ సందేశ్, పున‌ర్నవిలు స్ట్రాంగ్ అనే చెప్పాలి. మ‌రి ఎవ‌రు ఈ వారం ఇంటి నుండి వెళ‌తారో చూడాలి.

5571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles