హోట‌ల్‌గా మారిన బిగ్ బాస్ హౌజ్‌.. గెస్ట్‌ల‌తో సంద‌డి

Wed,October 16, 2019 08:17 AM

86వ ఎపిసోడ్‌లో శివ‌జ్యోతి చేసిన ప‌నికి ఇంటి స‌భ్యులు అంద‌రు నామినేష‌న్‌కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. 87వ ఎపిసోడ్‌లో ఇదే విష‌యంపై గ్రూపులుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. నేను చేసిన ప‌ని స‌రైన‌దే అని శివ‌జ్యోతి బాబా భాస్క‌ర్‌, శ్రీముఖిల ద‌గ్గ‌ర చెప్పుకోగా.. నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావ‌ని వ‌రుణ్ శివ‌జ్యోతిపై మండిప‌డ్డాడు. మొన్న‌టి వ‌ర‌కు వ‌రుణ్ గ్యాంగ్‌లో ఉన్న రాహుల్.. శివ‌జ్యోతి, అలీ తో జ‌త క‌ట్టి వితికా, వ‌రుణ్‌ల మ‌న‌స్త‌త్వాల గురించి వివ‌రించాడు. ఇక వితికా, వ‌రుణ్‌లు.. శివ‌జ్యోతి అన్న మాట‌ల‌ని కొద్ది సేపు బాబా భాస్క‌ర్ ద‌గ్గ‌ర చ‌ర్చించారు.


ఇదే స‌మ‌యంలో ప్ర‌క్రియ అర్ధ‌మైందా అని రాహుల్‌.. శ్రీముఖిని అడ‌గ‌గా, నువ్వు లైఫ్‌లో నాతో ఎప్పుడు మాట్లాడుకు. నేను నీతో మాట్లాడ‌ను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. నాకు కూడా నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని సింపుల్‌గా చెప్పేసి మేట‌ర్ క్లోజ్ చేశాడు రాహుల్‌. ఇక వ‌రుణ్ త‌న‌ని కంత్రీ, ఓవర్ యాక్టింగ్ అని అన‌డంపై ఎమోష‌నల్ అయిన శివ‌జ్యోతి క‌న్నీరు పెట్టుకుంది. అనంతరం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ హోట‌ల్ టాస్క్ ఇచ్చారు

బిగ్ బాస్ హౌజ్‌ని హోట‌ల్‌గా మార్చేసిన బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌తో ఫ‌న్నీ టాస్క్ లు చేయంచారు. ఫ్రీజ్, స్లీప్, మూవ్, ఫార్వర్డ్ ఇలా బిగ్ బాస్ ఆదేశాల ప్ర‌కారం ఇంటి స‌భ్యులు న‌డుచుకోవ‌ల‌సి ఉంటుంది. ఈ టాస్క్‌లో వ‌రుణ్ సందేశ్ హోట‌ల్ మేనేజ‌ర్‌గా ఉండ‌గా, షెఫ్‌లుగా బాబా భాస్క‌ర్, శ్రీముఖి, వితికాలు ఉంటారు. ఇక హౌజ్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ని శివ‌జ్యోతి,అలీ, రాహుల్ నిర్వ‌రిస్తారు. ఒక‌ప్పుడు టాప్ స్టార్ రేటింగ్ లో ఉన్న ఈ హోట‌ల్ కాల‌క్రేమ‌ణా కింది స్థాయికి ప‌డిపోయింది. ఆ హోట‌ల్‌కి పూర్వ వైభ‌వం తీసుకొస్తే ఇంట్లోకి గెస్ట్‌లు వ‌స్తార‌ని బిగ్ బాస్ స్ప‌ష్టం చేశారు.

టాస్క్‌లో భాగంగా ఇంటి స‌భ్యులు అంద‌రు డ్రిల్ చేస్తుండ‌గా, వితికా చెల్లి రితికా ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఆమెని చూసి ఎమోష‌న్ అయిన వితికా అలానే డ్రిల్ కొన‌సాగించింది. బిగ్ బాస్ రిలీజ్ అన్న త‌ర్వాత ఇంటి స‌భ్యులు అందరు రితికాతో స‌ర‌దాగా టైం స్పెంట్‌ చేశారు. వెళ్ళేముందు రితికా హోట‌ల్‌కి వ‌న్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇక ఎపిసోడ్ చివ‌ర‌లో అలీ భార్య మ‌సుమ హౌజ్‌లోకి అడుగు పెట్టింది. ఆ స‌మ‌యంలో అంద‌రు స్లీప్ మోడ్‌లో ఉన్నారు. ముందుగా శివ‌జ్యోతికి కిస్ పెట్టిన మ‌సుమ ఆ త‌ర్వాత అలీని త‌న ఒళ్ళో ప‌డుకోపెట్టుకొని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. ఇక నేటి ఎపిసోడ్‌లో శివ‌జ్యోతి భ‌ర్త గంగూలీతో పాటు మిగ‌తా హౌజ్ మేట్స్ కుటుంబ స‌భ్యులు కూడా బిగ్ బాస్ హోట‌ల్‌లోకి అడుగుపెట్ట‌నున్నారు.

3635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles