బోని క‌పూర్- అజిత్ చిత్రానికి ఆస‌క్తిక‌ర టైటిల్‌..!

Sat,October 19, 2019 08:49 AM

అజిత్- బోని క‌పూర్‌ నిర్మాణంలో పింక్ రీమేక్ చిత్రంగా నెర్కొండ పార్వాయి అనే చిత్రం రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఖాకీ ఫేం హెచ్ వినోద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించ‌గాగా, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్ర‌లలో క‌నిపించనున్నారు. లాయ‌ర్ పాత్ర‌లో అజిత్ క‌నిపించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మ‌రోసారి నెర్కొండ పార్వాయి టీంతో క‌లిసి త‌న 60వ చిత్రం చేయ‌బోతున్నాడు అజిత్‌.


అజిత్ 60వ చిత్రం వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ నిర్మించ‌నున్నారు. శుక్ర‌వారం శ్రీదేవికి నివాళులు అర్పించి పూజా కార్య‌క్ర‌మాలు జరిపారు. వాలిమై అనే టైట‌ల్‌ని చిత్రానికి ఫిక్స్ చేసిన టీం మూవీని 2020 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా బాణీలు స‌మ‌కూర్చ‌నున్నాడు. న‌య‌న‌తార‌ని క‌థానాయిక‌గా తీసుకోవాలని భావిస్తున్నార‌ట‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తుంద‌ని అంటున్నారు.

1143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles