సైమా ఏడ‌వ ఎడిష‌న్‌కి వేదిక ఫిక్స్‌

Tue,July 17, 2018 10:00 AM

ద‌క్షిణాది తార‌లంతా ఒకే చోట చేరి సంద‌డి చేసే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ సైమా (సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ ) వేడుక ప్ర‌తి సంవ‌త్స‌రం అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కి సంబంధించిన సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కి హాజ‌రు కానున్నారు. న‌టీమ‌ణుల గ్లామ‌ర్ తో , రాక్ ప‌ర్ఫార్మెన్స్ తో, సెల‌బ్రిటీల ఆట పాట‌ల‌తో సైమా వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు ఎడిష‌న్స్ పూర్తి చేసుకున్న సైమా ఈ ఏడాది దుబాయ్‌లో ఏడో ఎడిష‌న్ జ‌రుపుకోనుంది. సెప్టెంబ‌ర్ 7, 8వ తేదీల‌లో సైమా వేడుకని ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు. ఏడో తేదీన తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌కి సంబంధించిన న‌టీన‌టుల‌కి అవార్డులు ఇవ్వ‌నుండగా, ఎనిమిదో తేదీన త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల స్టార్స్‌కి అవార్డులు అందించ‌నున్నారు. ఇక ఈ వేడుక‌లో తారామ‌ణులు వెరైటీ కాస్ట్యూమ్స్‌తో ద‌ర్శ‌న‌మిస్తూ వీక్ష‌కుల‌కి క‌నువిందు చేయ‌నున్నారు.

1267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles