ప్రియాంక బాలీవుడ్ చిత్రానికి ముహూర్తం ఖ‌రారు

Thu,February 21, 2019 01:41 PM
The Sky Is Pink gets a release date

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్ళిన ప్రియాంక చోప్రా మ‌ళ్ళీ రెండేళ్ళ త‌ర్వాత హిందీ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ పాత్ర‌లు ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టేలా ఉంటాయ‌ని అంటున్నారు. సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో జైరా వ‌సీమ్ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుంది. ప్రియాంక త‌ల్లిగా జ‌రీనా న‌టిస్తుంది. అక్టోబ‌ర్ 11,2019న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్‌ చెప్పినా మోటివేషనల్‌ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథని తీసుకొని ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు . అయేషా పాత్ర‌లో జైరా క‌నిపించ‌నుండ‌గా, వయ‌సులోని వివిధ ద‌శ‌ల‌లో ప్రియాంక లుక్స్ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం మార్చిలో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకోనుంద‌ని అంటున్నారు. వెడ్డింగ్ సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్ అండ‌మాన్ నికోబార్ దీవుల‌లో జ‌ర‌ప‌నున్నార‌ట‌. ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ప్రియాంక చోప్రాలు 2005లో దిల్ ద‌ఢ్‌ఖ‌నే దో అనే చిత్రంతో తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ది స్కైజ్ ఈజ్‌ పింక్ వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న‌ రెండో చిత్రం. ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌డం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ అంటున్నారు. ప్రియాంక విష‌యానికి వ‌స్తే ఆమె న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం ఆ మూవీ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది ప్రియాంక‌.

1410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles