మరి కొద్ది నిమిషాల‌లో మెగా ట్రీట్

Tue,August 20, 2019 11:21 AM
The teaser of Chiranjeevi epic historic drama comes in short time

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌ల పూర్తి కాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర‌లో చిరు క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న బ‌ర్త్‌డే (ఆగ‌స్ట్ 22) సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్‌ని ఈ రోజు మ‌ధ్యాహ్నాం 2.40 ని.ల‌కి ముంబై విడుద‌ల చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. చిత్ర‌ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతుంద‌ని అంటున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు.

1511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles