ఫ‌స్ట్ లుక్‌తో అంచ‌నాలు పెంచిన కుర్ర హీరో

Wed,February 6, 2019 11:23 AM

కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న న‌టుడు శ్రీ విష్ణు. నీది నాదీ ఒకే క‌థ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న శ్రీ విష్ణు బ్రోచేవారెవ‌రురా అనే చిత్రం చేస్తున్నాడు. మెంట‌ల్ మ‌దిలో వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ఇందులో నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇక తాజాగా శ్రీ విష్ణు న‌టిస్తున్న తిప్ప‌రామీసం చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో శ్రీ విష్ణు లుక్ డిఫ‌రెంట్‌గా ఉంది. ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు కు జోడిగా చెన్నై మోడల్ నిక్కీ తంబోలిని నటిస్తుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు శ్రీ ఓం సినిమా బ్యానర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.


1840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles