ఆర్ఎక్స్ 100 హీరో మూడో సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Fri,April 26, 2019 12:32 PM
Third film of Kartikeya is titled as Guna 369

గ‌త ఏడాది వ‌చ్చిన ఆర్ఎక్స్ 100 చిత్రంలో ప్రేమ‌లో విఫ‌ల‌మైన యువ‌కుడి పాత్ర పోషించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన హీరో కార్తికేయ‌.ఈ ఒక్క చిత్రంతో కార్తికేయకి ఫుల్ క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కార్తికేయ‌.. నాని తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్‌లో విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. ఇక‌ హిప్పీ అనే చిత్రంతో కోలీవుడ్‌కి ఎంట్రీ కూడా ఇస్తున్నాడు కార్తికేయ‌. హిప్పీ చిత్రాన్ని టీఎన్ కృష్ణ తెర‌కెక్కిస్తుండ‌గా, మ‌రి కొద్ది రోజుల‌లో ఈ మూవీ విడుద‌ల కానుంది. కార్తికేయ మూడో చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేక‌ర్స్. గుణ 369 అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా, తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. గుణ 369 చిత్రానికి సంబంధించి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌లో కార్తికేయ భారీ కండ‌లు మాత్ర‌మే చూపించి ఫేస్‌ని దాచారు. చిత్రానికి సంబంధించిన పూర్తి డీటైల్స్ త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

1562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles