ఓ మైగాడ్ డాడీ అంటున్న బ‌న్నీ కిడ్స్.. సాంగ్ వీడియో

Thu,November 14, 2019 10:05 AM

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న చిత్రం అల .. వైకుంఠ‌పురుమ‌లో. జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన సాంగ్స్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ మూవీపై భారీ హైప్స్ క్రియేట్ చేస్తున్నారు. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా.., రాములో రాములో.. అనే సాంగ్స్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా చిత్రం నుండి మూడో సాంగ్ విడుద‌ల చేశారు. ఓ మై గాడ్ డాడీ అంటూ సాగే ఈ పాట‌లో అల్లు అయాన్‌, అల్లు అర్హాలు సంద‌డి చేశారు. న‌వంబ‌ర్ 22న ఫుల్ సాంగ్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఇక మ‌ల‌యాళ‌ములోను ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా అంగు వైకుంఠ‌పుర‌త్తు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్రంలో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి1559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles