ఒకరిని మించి మ‌రొక‌రు.. పాత్ర‌ల‌తో ర‌క్తి క‌ట్టించిన కంటెస్టెంట్స్‌

Sat,October 19, 2019 08:10 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 ప‌ద‌మూడో వారం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ వారం ఎపిసోడ్స్ అన్నీ ఎమోష‌న‌ల్‌గా సాగ‌గా, శుక్ర‌వారం ఎపిసోడ్ మాత్రం అందుకు భిన్నం అని చెప్ప‌వ‌చ్చు. ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ ప‌లు పాత్ర‌లు ఇచ్చి ఆ పాత్ర‌ల మాదిరిగా ప‌ర్‌ఫార్మెన్స్ చేయాల‌ని అన్నారు. దీంతో ఒక్కొక్కరు పాత్ర‌లలో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ర‌క్తి క‌ట్టించారు. రాహుల్‌తో స‌హా ప్ర‌తి ఒక్కరు త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌ల‌తో ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు.


90వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి జీరో ల‌గ్జరీ బడ్జెట్ పాయింట్స్ ఇచ్చారు. డ్రిల్స్ స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌ని కార‌ణంగా 1400 పాయింట్స్‌కి గాను జీరో పాయింట్స్ ఇచ్చారు. దీంతో అంద‌రు డీలా ప‌డ్డారు. ఇక ఇంటి స‌భ్యులు త‌మ కెరీర్ గ్రాఫ్ ఎలా ఉందో చెప్పాల‌ని కోర‌గా ముందుగా వితికా త‌న లైఫ్‌లో ఉన్న అప్ అండ్ డౌన్స్ గురించి వివ‌రించింది. ఆ త‌ర్వాత బాబా భాస్క‌ర్, శివ‌జ్యోతి త‌దిత‌రులు త‌మ జీవితంలో ప‌డ్డ క‌ష్ట‌న‌ష్టాల‌ని వివ‌రించారు. అనంత‌రం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి డే ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ టాస్క్ ఇచ్చారు.

టాస్క్‌లో భాగంగా ఇంటి స‌భ్యులు వాళ్ళకి ఇవ్వ‌బ‌డిన పాత్ర‌ల‌కి అనుగ‌ణంగా ప‌ర్‌ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బాబా భాస్కర్‌కి బాషా, శ్రీముఖికి మహానటి, వరుణ్-వితికాలు బాహుబలి, దేవసేన, రాహుల్‌కి కాంచన, అలీకి గజిని, శివజ్యోతికి చంద్రముఖి పాత్రల్ని ఇచ్చారు. దీంతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయి జీవించేశారు కంటెస్టెంట్స్. నాగేశ్వ‌ర‌రావు గారు వ‌చ్చారా అంటూ శ్రీముఖి సంద‌డి చేస్తే, బాబా భాస్క‌ర్.. భాషా, మాణిక్ భాషా అని హ‌డావిడి చేశాడు.

ప‌ర్‌ఫార్మెన్స్ టాస్క్‌లో ప్ర‌తి ఒక్క‌రు వంద శాతం రిజ‌ల్ట్ ఇచ్చారు. వీరి ప‌ర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. బాహుబ‌లి, దేవ సేన‌గా వ‌రుణ్‌, వితికాలు అద‌ర‌గొట్టారు. కాంచ‌న‌గా రాహుల్ విల‌య తాండవం సృష్టించాడు. చంద్ర‌ముఖిగా సావిత్రి మంచి ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. అలీ కూడా గ‌జినీగా ప‌ర్వాలేద‌నిపించాడు. మొత్తానికి శుక్ర‌వారం ఎపిసోడ్ ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగింది. ఈ రోజు శ‌నివారం కావ‌డంతో నాగార్జునతో ఇంటి స‌భ్యుల సంద‌డి ఉండ‌నుంది. నామినేష‌న్‌లో ఉన్న ఏడుగురిలో కొంద‌రు నేడు సేవ్ కానున్నారు. వారు ఎవ‌రో తెలుసుకోవాలంటే కొన్ని గంట‌లు ఆగాల్సిందే .

2600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles