ఈ ఏడాది బెస్ట్ సాంగ్ ఇదే

Mon,February 11, 2019 12:54 PM
This is America wins the best song of the year in Grammy Awards

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. సింగర్ అలీసియా కీస్ ఈ షోను హోస్ట్ చేసింది. ఈ షోలో డయానా రాస్, మైలీ సైరస్, పోస్ట్ మలోన్, డాలీ పార్టాన్, జానెల్ మోనే, షాన్ మెండిస్, కాటీ పెర్రీ, రిక్కీ మార్టిన్‌లాంటి స్టార్ సింగర్స్ పర్ఫామ్ చేశారు. ఇక ఈసారి నాలుగు అత్యుత్తమ అవార్డు కేటగిరీలైన ఆల్బమ్, రికార్డ్, సాంగ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్‌లలో ఐదుకు బదులుగా ఎనిమిది నామినీలను ప్రకటించడం విశేషం. లేడీ గాగా రెండు అవార్డులను అందుకోగా.. గత వారం ఈ అవార్డు ప్రొడ్యూసర్స్‌తో విభేదాల వల్ల సెర్మనీకి హాజరు కాని అరియానా గ్రాండె తన తొలి గ్రామీని గెలుచుకుంది. హాలీవుడ్ హిట్ మూవీ ఎ స్టార్ ఈజ్ బార్న్‌లో షాలో అనే సాంగ్‌కుగాను విజువల్ మీడియాలో బెస్ట్ సాంగ్‌గా, జొవానె (వేర్ డు యు థింక్ యు ఆర్ గోయింగ్)కు పాప్ సోలో పర్ఫార్మెన్స్ అవార్డులను గాగా సొంతం చేసుకుంది.

గ్రామీ విజేతలు వీళ్లే


సాంగ్ ఆఫ్ ద ఇయర్- దిస్ ఈజ్ అమెరికా (డొనాల్డ్ గ్లోవ‌ర్ అలియాస్ చైల్డిష్ గాంబినో)
బెస్ట్ పాప్ సోలో - జొవానె - లేడీ గాగా
బెస్ట్ పాప్ జోడీ - లేడీ గాగా, బ్రాడ్‌లీ కూపర్ (ఎ స్టార్ ఈజ్ బార్న్)
బెస్ట్ ట్రెడిషనల్ పాప్ ఆల్బమ్ - మై వే (విలీ నెల్సన్)
బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ - స్వీటెనర్ (అరియానా గ్రాండె)
బెస్ట్ డ్యాన్స్ రికార్డింగ్ - ఎలక్ట్రిసిటీ
బెస్ట్ ఈడీఎం ఆల్బమ్ - వుమన్ వరల్డ్‌వైడ్ (జస్టిస్)
బెస్ట్ రాక్ సోలో - వెన్ బ్యాడ్ డజ్ గుడ్ (క్రిస్ కార్నెల్)
బెస్ట్ రాక్ సాంగ్ - మాసెడక్షన్ (జాక్ ఆంటోనోఫ్, ఆనీ క్లార్క్)

4726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles