పాపులర్ హీరోస్ తో వరుస సినిమాలు

Sat,November 5, 2016 08:21 AM

అధినేత, ఏమైంది ఈ వేళ, బెంగాల్ టైగర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన నిర్మాత కెకె రాధామోహన్ ఇటీవల నవీన్ చంద్ర, పృధ్వీ ప్రధాన పాత్రలలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే చిత్రాన్ని తీసాడు. ఈ చిత్రం నవంబర్ లో థియేటర్స్ కి రానుంది. ఇక రాధామోహన్ పాపులర్ హీరోస్ తో మరి కొన్ని సినిమాలను నిర్మించేందుకు రెడీ అయ్యాడు. మొదట యంగ్ హీరో నాగ శౌర్యతో ఓ సినిమా చేయాలని భావిస్తున్న రాధామోహన్ ఈ చిత్రాన్ని జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఆ తర్వాత గోపిచంద్ తో ఓ చిత్రం, లవర్ బోయ్ నితిన్ తో ఓ చిత్రం చేయాలని డిసైడ్ అయ్యాడట. ఈ మూడు సినిమాలకు సంబంధించిన నటీనటు వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు. ఇక చిత్ర రిలీజ్ విషయానికి వస్తే ఈ మూడు చిత్రాలు 2017 సమ్మర్ లో బాక్సాఫీస్ ని హిట్ చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

1919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles