స‌వ్య‌సాచి నుండి ఫ‌స్ట్ వీడియో సాంగ్ విడుద‌ల‌

Tue,November 6, 2018 08:49 AM

ప్రేమ‌మ్ చిత్రం త‌ర్వాత చందూ మొండేటి, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం స‌వ్య‌సాచి. నవంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ ల‌భించింది. రెగ్యులర్ రివేంజ్ కథను కొత్తగా చెప్పడంలో కొంతవరకు దర్శకుడు సక్సెస్ అయ్యారు.వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే పాయింట్ బాగానే ఉన్నా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయారు దర్శకుడు. అరుణ్ రాజ్ అనే పాత్ర‌లో మాధ‌వ‌న్ అద్భుతంగా న‌టించాడు. వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖరామన్, షకలక శంకర్‌లపై తెరకెక్కించిన కామెడీ వర్కవుట్ అయ్యింది.క‌థానాయిక‌గా న‌టించిన నిధి అగ‌ర్వాల్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. కీర‌వాణి సంగీతం సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. సినిమాపై జ‌నాల‌లో మ‌రింత ఆస‌క్తి క‌లిగేలా ముఖ్య స‌న్నివేశాల‌తో చిత్రానికి సంబంధించి టిక్ టిక్ టిక్ అనే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles