రామ్ చ‌ర‌ణ్ మూవీ ఫ‌స్ట్ లుక్‌కి ముహూర్తం ఖ‌రారు !

Tue,September 25, 2018 10:25 AM
time fix for rc 12 first look

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం ఘ‌న విజ‌యం సాధించిన జోష్‌లో మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీనుతో క‌లిసి తన 12వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ యూరప్ లోని అజర్ బైజాన్ అనే ప్రదేశంలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరో రామ్ చరణ్ తోపాటు ప్రతినాయకుడు వివేక్ ఒబెరాయ్ అలాగే ఇతర తారాగణంపై ఈ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్రంలో కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, వివేక్‌ ఒబెరాయ్, ఆర్య‌న్ రాజేష్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . క‌న్న‌డ హీరో సుదీప్‌ ఈ సినిమాలోను విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ‌వంశ‌స్థుడు, రాజ మార్తాండ అనే టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో ఈ సినిమా విడుద‌ల కానుంది. అయితే చిత్ర ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తుండ‌గా ,ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది..

2528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles