ఈ సారి కూడా చెర్రీ నిరాశ‌ప‌ర‌చనున్నాడా..!

Thu,October 18, 2018 11:16 AM
Title Being Reconsidered For rc 12

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం విజ‌యోత్సాహంతో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 12వ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే . ప్ర‌స్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, బోయ‌పాటి కొన్ని యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ప్ర‌శాంత్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . వివేక్‌ ఒబెరాయ్ ఈ సినిమాలో విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు . ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. డీవివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది.

చెర్రీ తాజా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు విడుద‌ల కానుంద‌ని మెగా ఫ్యాన్స్ భావించారు. కాని అది జ‌ర‌గ‌లేదు. వినాయక చవితి సంద‌ర్భంగా అయిన విడుద‌ల అవుతుంద‌ని అనుకున్నారు. కాని అప్పుడు నిరాశే ఎదురైంది. చివ‌ర‌కి ద‌స‌రా రోజైన మెగాప‌వ‌ర్ స్టార్ త‌న తాజా చిత్ర ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసి అభిమానుల‌ని ఆనందింప‌జేస్తాడ‌ని అనుకున్నారు. కాని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ రోజు కూడా టైటిల్ రివీల్ చేయ‌ర‌ని తెలుస్తుంది. ఈ చిత్రానికి బోయ‌పాటి విన‌య విధేయ రామ అనే టైటిల్ పెట్టాల‌ని భావించాడ‌ట‌. కాని దీనికి ఇటు ఫ్యాన్స్ అటు కామ‌న్ ఆడియ‌న్స్ నుండి స‌రైన స్పంద‌న రాక‌పోవ‌డంతో వాయిదా వేశాడ‌ట‌. త్వ‌ర‌లో మంచి టైటిల్ ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేయ‌నున్నాడ‌ట‌.

3143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles