కాంచ‌న రీమేక్‌లో అక్ష‌య్.. టైటిల్ ఫిక్స్ చేసిన యూనిట్‌!

Sun,April 21, 2019 11:58 AM

ముని సిరీస్‌కి సీక్వెల్‌గా వ‌చ్చిన కాంచ‌న చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2011లో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కుడు లారెన్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోను రీమేక్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ‌ర‌త్ కుమార్ పాత్ర కోసం ప‌లువురు ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోల‌తో లారెన్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.ఇక క‌థానాయిక‌గా భ‌ర‌త్ అనే నేను ఫేం కియారా అద్వానీని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న‌ ఈ చిత్రానికి ‘లక్ష్మి’ అనే టైటిల్ ఖరారు చేసారని సమాచారం.


కాంచ‌న సిరీస్‌లో వ‌చ్చిన చిత్రాల‌న్నింటికి మంచి ఆద‌రణ ల‌భిస్తుండ‌డంతో లారెన్స్ కాంచ‌న సిరీస్‌లో నాలుగో భాగంగా కాంచ‌న 3 చిత్రాన్ని తెర‌కెక్కించి నిర్మించిన విష‌యం విదిత‌మే. ఈ చిత్రం ఏప్రిల్ 19న సౌత్‌లో విడుద‌ల అయింది. ఈ చిత్రానికి జెర్సీ చిత్రం గ‌ట్టి పోటీ ఇస్తున్నా మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మిళనాట కూడా ఈ చిత్రానికి స్టార్ హీరో సినిమా క‌న్నా ఎక్కువ వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంటున్నారు.

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles