బ్రేకప్ పై స్పష్టత ఇచ్చిన టాలీవుడ్ హీరో

Tue,April 23, 2019 05:59 PM
Tollywood actor clarifies on his breakup issue


తెలుగులో అవును చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు హర్షవర్దన్ రాణే. ఆ తర్వాత హిందీలో పలు ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌కు చెక్కేశాడు హర్షవర్దన్. ఖడ్గం ఫేం కిమ్ శర్మ, హర్షవర్దన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ ఇద్దరూ ముంబై రోడ్లపై కలిసి తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారు ఈ కపుల్. అయితే ఈ జంట తమ రిలేషన్‌ షిప్ కు స్వస్తి చెప్పినట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా కిమ్‌తో బ్రేకప్ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టత ఇచ్చాడు హర్షవర్దన్. ధన్యవాదాలు నీతో ప్రయాణం అద్భుతం..అంతకంటే ఎక్కువ. నీకు, నాకు దేవుడి దీవెనలు ఉండాలి..బై అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌తో కిమ్, హర్షవర్దన్ మధ్య దాదాపు బ్రేకప్ అయిపోయినట్లేనని తెలుస్తోంది. గతంలో క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తో డేటింగ్‌లో ఉన్న కిమ్ శర్మ..అతనికి బై చెప్పి హర్షవర్దన్‌తో కలిసి తిరిగింది.

View this post on Instagram

#GodBlessYou #Respect

A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) on

3689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles