హీరో వరుణ్ తేజ్‌‌కు తప్పిన ప్రమాదం..

Wed,June 12, 2019 09:32 PM
Tollywood actor Varun Tejs car meets with accident

వనపర్తి: సినీనటుడు వరుణ్‌తేజ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్ కారు ముందు వెళ్తున్న మ‌రో కారును ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా అందరూ క్షేమంగా బయటపడ్డారు. తేజ్ కారులో ఉన్న నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే మరో కారులో షూటింగ్ కోసం బయలుదేరి వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాల్మీకి షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తనకు ఎలాంటి గాయాలు కాలేదని వరుణ్ ట్విటర్‌లో స్పందించారు.6048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles