ఈ వారం బాక్సాఫీస్ ఫైట్‌లో గెలుపెవరిది?

Fri,August 26, 2016 11:04 AM

గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ సాధించిన చిత్రం మరేది లేదనే చెప్పాలి. వారానికి రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న.. ఇవేవి ఆడియన్స్‌ని అంతగా అలరించడం లేదని తెలుస్తోంది. పెళ్ళి చూపులు చిత్రం తర్వాత అంతటి హిట్ కొట్టిన చిత్రం ఏది ఈ మధ్య కాలంలో రాలేదు. ఈ వారం బాక్సాఫీస్ వద్ద నాలుగు స్ట్రైట్ చిత్రాలు పోటికి దిగుతుండగా, రెండు డబ్బింగ్ మూవీస్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి ఇందులో ఏ చిత్రం ప్రేక్షకుల మనసుని గెలుచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


ధనరాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన బంతిపూల జానకి చిత్రం ఈ రోజు విడుదల కానుంది. కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ చిత్రంగా బంతిపూల జానకి ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఇక చాలా గ్యాప్ తర్వాత తారకరత్న హీరోగా వస్తోన్న చిత్రం ఎవరు. ఈ మూవీ కూడా నేడే విడుదల కానుంది. వీటితో పాటు హిట్ చిత్రాల దర్శకుడు ప్రభు సాల్మాన్ రూపొందించిన తొలి ప్రేమలో, సురేష్ కెవి ఫిలిం అవసరానికో అబద్ధం చిత్రాలు కూడా ఈ రోజే బాక్సాఫీస్ వద్ద ఫైట్‌కి దిగుతున్నాయి. ఇక దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ కాంబినేషన్‌లో తెరక్కెకిన మలయాళ చిత్రం తెలుగులో 100 డేస్ ఆఫ్ లవ్ పేరుతో ఈ రోజే విడుదల కాబోతుంది. వీటితో పాటు మెకానిక్ 2 అనే డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్ కానుంది. మరి ఈ పోటీలో గెలుపెవరిదో తెలియాలంటే కొద్ది నిమిషాలు ఆగాల్సిందే.

1568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles