త్రిష చిత్రానికి ఆస‌క్తిక‌ర టైటిల్‌

Sat,April 20, 2019 11:51 AM
Trisha movie title is raangi

ఒక‌ప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో వ‌రుస‌ సినిమాల‌తో బిజీ అయింది. అక్క‌డ త్రిష‌కి అభిమానులు నీరాజ‌నాలు పలుకుతున్నారు. చివ‌రిగా ఆమె న‌టించిన 96, పేట చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో త్రిష‌కి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె కిట్టీలో అర‌డ‌జ‌నుకి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయ‌ని స‌మాచారం. అయితే మురుగ‌దాస్ శిష్యుడు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త్రిష ప్ర‌స్తుతం క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిపారు. ఈ చిత్రానికి ‘రాంగి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. త్రిష గ‌తంలో న‌టించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు నాయ‌కి, మోహిని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. మ‌రి ఈ చిత్రంతో అయిన స‌క్సెస్ సాధిస్తుందా చూడాలి.

రాంగి ద‌ర్శ‌కుడు శ‌ర‌వ‌ణ‌న్.. ఎంజియుమ్ ఎప్పోదుమ్ అనే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. జ‌ర్నీ సినిమాతో పాపుల‌ర్ అయ్యాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంకి కేఏ శ‌క్తివేల్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నున్నారు. ర‌జనీకాంత్ ద‌ర్భార్ చిత్రంతో బిజీగా ఉన్న మురుగ‌దాస్ రాంగి చిత్రానికి స్టోరీ అందిస్తుండ‌డం విశేషం. మ‌రి కొద్ది రోజుల‌లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

1461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles