400 మంది జ‌న‌సైనికుల అకౌంట్స్ స‌స్పెండ్ చేసిన ట్విట్ట‌ర్‌

Wed,September 18, 2019 12:09 PM

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంల‌లో ట్విట్ట‌ర్ ఒక‌టి. ట్విట్ట‌ర్ వేదికగా అనేక విష‌యాలని మ‌నం ప్ర‌జ‌ల‌కి తెలియ‌జేయవ‌చ్చు, మ‌నం తెలుసుకోవ‌చ్చు. అయితే కొద్ది రోజులుగా జ‌న‌సైనికులు పవ‌న్ పిలుపు మేర‌కు నల్లమల అడవిలోని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు. వైస్ జ‌గ‌న్ ఫేయిల్డ్ యాస్ సీఎం తో పాటు సేవ్ న‌ల్ల‌మ‌ల అనే యాష్ ట్యాగ్‌తో మ‌రి ట్రెండ్ చేస్తున్నారు. ఇది ట్విట్ట‌ర్ ప్లాట్‌ఫాం నిబంధ‌న‌ల‌కి విరుద్దం. ఈ కార‌ణంగా మీ ట్విట్ట‌ర్ అకౌంట్స్ స‌స్పెండ్స్ చేస్తున్నామ‌ని మెయిల్ వ‌చ్చాయ‌ట‌. దాదాపు 400 మంది అకౌంట్స్ స‌స్పెండ్స్ కావ‌డంతో జ‌న‌సైనికులు షాక్‌కి గుర‌య్యారు. సోష‌ల్ మీడియా ద్వారా త‌మ గొంతుని స్ట్రాంగ్‌గా వినిపిస్తున్న స‌మ‌యంలో ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం ఇలా చేయ‌డం దారుణ‌మైన సంఘ‌ట‌న అని జ‌న‌సైనికులు వాపోతున్నారు.


1845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles