ప్ర‌భాస్‌ని ఫాలో అవుతున్న క‌త్రినా, కాజ‌ల్‌

Sat,April 27, 2019 10:39 AM
two beauties following prabhas

మొన్న‌టి వ‌ర‌కు ఫేస్ బుక్ వేదికగా అభిమానుల‌తో ట‌చ్‌లో ఉండే ప్ర‌భాస్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి పోస్ట్‌గా బాహుబ‌లికి సంబంధించి ఓ ఫోటో పోస్ట్ చేశాడు. అమరేంద్ర బాహుబలి పాత్రలో కత్తులను తిప్పుతున్న ఫొటోను షేర్ చేయ‌గా,ఆ ఫోటోకి విప‌రీత‌మైన లైక్స్ వ‌చ్చాయి. ఈ ఫోటో త‌ప్ప మ‌రో పోస్ట్ ఇప్ప‌టి వ‌ర‌కు పెట్ట‌లేదు ప్ర‌భాస్‌. అయితే యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి ప్ర‌స్తుతం 1.1 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, అందులో బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్‌, క‌లువ క‌ళ్ళ సుంద‌రి కాజ‌ల్ ఉన్నారు. వీరిద్ద‌రు రీసెంట్‌గా ప్ర‌భాస్‌ని ఫాలో అవ్వ‌డం మొద‌లు పెట్టారు. క‌త్రినా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్‌తో ఒక్క సినిమా చేయ‌క‌పోయిన ఆయ‌న‌కి ఉన్న క్రేజ్‌ని బ‌ట్టి ఫాలో అవుతుంది. ఇక ప్ర‌భాస్‌, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన డార్లింగ్‌, మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ చిత్రాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు భారీ విజ‌యం సాధించాయి. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు .



4986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles