సుకుమార్ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు..!

Sun,November 4, 2018 10:37 AM
two heroines for mahesh next movie

రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ హిట్ కొట్టిన సుకుమార్ .. అతి త్వ‌ర‌లో మ‌హ‌ర్షి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ మ‌హేష్ బాబుతో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ 26వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ మూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ రూపొందించ‌నుంది . ఇటీవ‌ల‌ ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొద‌లు పెట్టిన‌ సుక్కూ 2019లో మూవీ విడుద‌ల చేయ‌నున్నాడట‌. సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి త‌న సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ని ఎంపిక చేశాడ‌ని తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ని కూడా ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు సుకుమార్‌.

మ‌హేష్-సుకుమార్ కాంబినేషన్‌లో 1 నేనొక్క‌డినే చిత్రం తెరకెక్క‌గా, ఈ మూవీ అంత‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోయింది. అయితే వీరిద్ద‌రి తాజా ప్రాజెక్ట్ స్వాతంత్య్రం త‌ర్వాత జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో ఉంటుంద‌ని స‌మాచారం. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో టీం ఉంది. అయితే ఇందులో క‌థానాయిక‌లుగా సుకుమార్ ఇద్ద‌రు భామ‌ల‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వాని, దేవ‌దాస్ భామ‌ రష్మిక మందన్న చిత్రంలో మ‌హేష్‌తో జత‌క‌ట్ట‌నున్నార‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌లసి ఉంది. మ‌హేష్ ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి చిత్రంతో బిజీగా ఉండ‌గా, కొద్ది రోజుల‌లో ఈ చిత్రం యూ ఎస్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైద‌రాబాద్ షెడ్యూల్‌కి సిద్ద‌మ‌వుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే, మ‌హేష్ ..సుకుమార్‌తో క‌లిసి ప‌ని చేయ‌నున్నాడు.

2960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles