ఒకే రోజు పోటీ ప‌డేందుకు సిద్ధ‌మైన స్టార్ హీరోలు

Sun,October 13, 2019 08:10 AM

సంక్రాంతి బ‌రిలో ప‌లు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, టాలీవుడ్ టాప్ స్టార్స్ మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ ఒకే రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మ‌హేష్‌త‌న ట్విట్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో మ‌హేష్ క‌నిపంచ‌నుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంది. విజ‌య శాంతి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.


ఇక నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్..త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల‌.. వైకుంఠ‌పుర‌ములో అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంద‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. చిత్రంలో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవ‌ల‌ చిత్రం నుండి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న అనే సాంగ్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మొత్తానికి రెండు చిత్రాల‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్న‌ప్ప‌టికి ఏ చిత్రం ఎక్కువ ఆద‌ర‌ణ పొందుతుందో చూడాలి.

1308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles