వైర‌ల్‌గా మారిన‌ ప్రియాంక, నిక్‌ల పెళ్లి ఫోటోలు

Sat,December 29, 2018 01:47 PM
unseen pictures from Priyanka Chopra, Nick Jonas wedding

డిసెంబ‌ర్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ల వివాహం ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హిందూ, క్రైస్త‌వ ప‌ద్ద‌తిలో వీరి వివాహం జోధ్‌పూర్‌లోని ఉమైద్ భ‌వ‌న్ వేదిక‌గా అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. వీరి పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కి వచ్చాయి. అయితే పెళ్ళి, సంగీత్ వేడుక‌ల‌లో ఎలాంటి హంగామా జ‌రిగిందో తెలుసుకోవాల‌ని అభిమానులు ఎంతో ఉత్సుక‌త‌తో ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో ప్రియాంక‌, నిక్‌ల పెళ్లికి సంబంధించిన మ‌రి కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల‌ని చూస్తుంటే ప్రియాంక‌, నిక్‌లు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పెళ్లి వేడుక‌లో ఫుల్ హంగామా చేశార‌ని అర్ధ‌మ‌వుతుంది. జోసెఫ్ రాధిక్ ఈ ఫోటోల‌ని త‌న కెమెరాలో బంధించ‌గా, ఆ ఫోటోలు ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా పేజ్‌లో చక్క‌ర్లు కొడుతున్నాయి. నిక్ త‌ల్లి తండ్రుల‌తో పాటు అన్న‌, వదినల ఫోటోలు అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.ఇక ప్రియాంక‌- నిక్‌లు ఢిల్లీలో ఒక రిసెప్ష‌న్ జ‌రుపుకోగా, ముంబైలో రెండు రిసెప్షన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ నూతన జంట హ‌నీమూన్ కోసం స్విట్జ‌ర్‌లాండ్ వెళ్ళిన‌ట్టు తెలుస్తుంది. అక్క‌డి నుండి వ‌చ్చాక ప్రియాంక త‌న తాజా ప్రాజెక్టుల‌తో బిజీ కానుంది.

5374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles