సౌత్ స్టార్స్‌ని నిర్ల‌క్ష్యం చేయ‌డంపై మోదీని ప్ర‌శ్నించిన ఉపాస‌న‌

Sun,October 20, 2019 12:00 PM

మహాత్మ గాంధీ 150వ జ‌యంత్యుత్స‌వాల‌కి సంబంధించిన కార్య‌క్ర‌మాల గురించి చ‌ర్చించ‌డానికి ప్ర‌ధాని మోదీ బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ క‌పూర్‌, ర‌కుల్‌ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌ని త‌న ఇంటికి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. అయితే ద‌క్షిణాది నుండి దిల్ రాజు మిన‌హా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమల నుండి ఏ సెలబ్రిటీకి ఆహ్వానం అందలేదు. దీనిపై రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీని ప్ర‌శ్నించింది.


ద‌క్షిణాదిన మీరంటే మాకు ఎంతో గౌర‌వం. మీరు ప్ర‌ధానిగా ఉండ‌టం ప‌ట్ల మేము గ‌ర్విస్తున్నాయి. గొప్ప కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ప్పుడు వాటిలో హిందీ ఆర్టిస్టుల‌నే ఎక్కువ భాగం ప‌రిమితం చేస్తున్నారు. ద‌క్షిణాది న‌టుల‌ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. చాలా బాధ‌తో నా మ‌న‌సులో భావాన్ని మీకు వ్య‌క్త‌ప‌రుస్తున్నాను అని ఉపాస‌న.. మోదీకి ట్వీట్ చేసింది. చిత్ర పరిశ్రమకు దక్షిణాది పరిశ్రమలు ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తుండ‌గా, మోదీ మ‌న‌ల్ని భాగం చేయ‌క‌పోవ‌డం ముమ్మాటికి త‌ప్పే అని ఉపాస‌న‌ని స‌మ‌ర్ధిస్తూ మాట్లాడుతున్నారు నెటిజ‌న్స్.



2140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles