త‌మ‌న్నాకి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఉపాస‌న‌

Fri,October 4, 2019 01:11 PM

గాంధీ జ‌యంతి శుభాకాంక్ష‌ల‌తో అక్టోబ‌ర్ 2న విడుద‌లైన సైరా చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళు రాబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అన్ని చోట్ల ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ నిర్మించిన చారిత్రాత్మ‌క చిత్రం ఇంత మంచి విజ‌యం సాధించ‌డంతో మెగాస్టార్ చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నారు. చిత్ర‌బృందం కూడా విజ‌యాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక సైరా చిత్ర నిర్మాత చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా సైరా విజ‌యాన్ని ఆస్వాదిస్తూ చిత్రంలో ల‌క్ష్మీ న‌ర‌సింహారెడ్డి పాత్ర పోషించిన త‌మ‌న్నాకి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చింది.


ఖ‌రీదైన ఉంగ‌రాన్ని త‌మ‌న్నాకి బ‌హుమ‌తిగా ఇచ్చిన ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఉంగ‌రంతో త‌మ‌న్నా దిగిన ఫోటోని షేర్ చేస్తూ .. `నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం` అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. న‌ర్సింహారెడ్డి ప్రియురాలిగా, న‌ర్త‌కిగా త‌మన్నా త‌న పాత్ర‌లో జీవించింది. ఆమె పాత్ర‌పై ప్ర‌శంసల వ‌ర్షం కురుస్తుంది.4060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles