సెట్‌లో స్టార్ క‌మెడీయ‌న్ బ‌ర్త్‌డే జ‌రిపిన 'వీ' టీం

Thu,September 19, 2019 01:27 PM

ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం, అలీ, సునీల్‌, ఎంఎస్ నారాయ‌ణ వంటి స్టార్ కమెడీయ‌న్స్ తమ కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించేవారు. ఈ జ‌న‌రేష‌న్‌లో ద‌ర్శ‌కుల‌కి కనిపిస్తున్న‌ ఏకైక ఆప్ష‌న్ వెన్నెల కిషోర్ అని చెప్ప‌వ‌చ్చు. వెన్నెల కిషోర్ కోసం స‌ప‌రేట్ కామెడీ ట్రాక్ రెడీ చేస్తున్నారు నేటి ద‌ర్శ‌కులు. స్టార్ హీరోల సినిమాల‌లోను వెన్నెల కిషోర్ న‌వ్వుల జ‌ల్లు కురిపిస్తున్నాడు. 1980 సెప్టెంబర్ 19న జన్మించిన ఆయన నేడు 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా వీ చిత్ర బృందం ఆయ‌న‌తో కేక్ క‌ట్ చేయించి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్ జ‌రిపారు. వీ చిత్రం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. థాయ్ ల్యాండ్‌లో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. వెన్నెల కిషోర్ ఈ చిత్రంలోను తన కామెడీతో క‌డుపుబ్బ న‌వ్వించున్నాడ‌ట‌. 2005లో విడుదలైన వెన్నెల చిత్రంతో వెండితెరకు పరిచయమైన వెన్నెల కిషోర్ దశాబ్దానికి పైగా అనేక చిత్రాలలో నటించి, తన హాస్యంతో ఆ చిత్ర విజయాలలో కీలకపాత్ర వహించారు.



1850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles