వ‌చ్చాడ‌య్యో ప‌హిల్వాన్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

Fri,July 12, 2019 08:20 AM

తెలుగు, క‌న్న‌డ చిత్రాల‌తో పాటు ప‌లు భాష‌ల‌లోను అల‌రిస్తున్న సుదీప్ తాజాగా ప‌హిల్వాన్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని న‌టుడు ఎస్‌.కృష్ణ తెర‌కెక్కిస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్‌ నేతృత్వంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్‌ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించి వచ్చాడ‌య్యో ప‌హిల్వాన్ అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో సుదీప్ లుక్స్ ప్రేక్ష‌కుల‌కి పిచ్చెక్కిస్తున్నాయి. సినిమా త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. తొలిసారిగా సుదీప్‌ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ఈ సినిమా కోసం ప‌లు కసరత్తులు సైతం చేశారు సుదీప్. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహాన్‌సింగ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో ప‌హిల్వాన్ అనే టైటిల్ తో విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం సుదీప్ సైరా చిత్రంతో పాటు దబాంగ్ 3 అనే చిత్రం చేస్తున్న విష‌యం విదిత‌మే.


1491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles