వ‌చ్చాడ‌య్యో సామి మేకింగ్ వీడియో విడుద‌ల‌

Tue,May 29, 2018 08:26 AM
Vachaadayyo Saami making video released

ఇటీవ‌ల బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రాల‌లో ఒక‌టి భ‌ర‌త్ అనే నేను. మ‌హేష్ బాబు, కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ కొట్టింది. అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ చిత్రంలో వ‌చ్చాడ‌య్యో సామి పాట ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సాంగ్‌కి 4 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ వ‌చ్చాయి. కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ‌జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌లో మ‌హేష్ పంచెక‌ట్టులో కనిపించి ప్రేక్ష‌కుల‌కి క‌నువిందు చేశాడు. 360డిగ్రీల కోణంలో చిత్రీక‌రించిన సాంగ్‌ మేకింగ్ వీడియోని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ వీడియోలో క‌ర్స‌ర్‌ని మూవ్ చేస్తూ చుట్టు ప్ర‌క్క‌ల ప‌రిస‌రాల‌న్నింటిని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇక తాజాగా రాజు సుంద‌రం నృత్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌హేష్ అండ్ టీం చేసిన డ్యాన్స్‌కి సంబంధించి మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇది ఫ్యాన్స్ ని ఎంత‌గానో అల‌రిస్తుంది. భ‌ర‌త్ అనే నేను చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ రూపొందింది. ఇందులో మహేష్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా కనిపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా విడుద‌లైన వీడియో సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.

2553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles