మెగా హీరో డెబ్యూ మూవీ సైలెంట్‌గా మొద‌లైంది..!

Sat,August 18, 2018 09:29 AM
Vaishnav Tej movie started silently

చిరంజీవి మొదలు పెట్టిన నట ప్రస్థానాన్ని కొన‌సాగిస్తూ మెగా ఫ్యామిలీ నుండి చిరు,పవన్ ,బన్నీ,చరణ్ ,సాయిధరమ్ ,వరుణ్ తేజ్ ,అల్లు శిరీష్, క‌ళ్యాణ్ తేజ్‌లు టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వగా ఇదే ఫ్యామిలీ నుండి మెగా హీరోయిన్‌గా నిహారిక ప‌రిచ‌యం అయింది. ఇక కొన్నాళ్ళుగా సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా హీరోగా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కావాల‌ని అనుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని సబ్జెక్ట్ లు కూడా వినడం జరిగింది. ఈ క్ర‌మంలో త‌న మూవీని సైలెంట్‌గా మొద‌లు పెట్టాడ‌ట వైష్ణ‌వ్‌.

వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ మూవీని ‘నేల టిక్కెట్టు’ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నార‌ట . రామ్ తాళ్లూరి గతంలోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ దర్శకుడు సాగర్‌ కె. చంద్రతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రు క‌లిసి వైష్ణవ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా చేస్తున్నారు . ఎలాంటి హ‌డావిడి లేకుండా సైలెంట్‌గా సినిమా మొద‌లు పెట్ట‌డంతో అంద‌రు షాక్ లో ఉన్నారు. వైష్ణవ్ తేజ్ గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా నటించాడు. ఈ కుర్రాడు ఓ వైపు తన చదువును కొనసాగిస్తూనే మరో వైపు నటన,డ్యాన్స్ ,ఫైట్స్ ఇలా అన్ని కేటగిరీల్లో శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది. తొలి సినిమా విషయంలో ఇప్పటికే మెగా హీరోల సలహ తీసుకుంటున్న వైష్ణవ్ తేజ్ త‌న డెబ్యూ మూవీతో ఎంత‌గా అల‌రిస్తాడో చూడాలి.

2592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles