మెగా ఫ్యామిలీ నుండి మ‌రో హీరో.. గ్రాండ్‌గా లాంచ్ అయిన చిత్రం

Mon,January 21, 2019 12:08 PM
vaishnav tej new movie launched

చిరంజీవి మొదలు పెట్టిన నట ప్రస్థానాన్ని కొన‌సాగిస్తూ మెగా ఫ్యామిలీ నుండి పవన్ ,బన్నీ,చరణ్ ,సాయిధరమ్ ,వరుణ్ తేజ్ ,అల్లు శిరీష్, క‌ళ్యాణ్ దేవ్‌లు టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వగా ఇదే ఫ్యామిలీ నుండి మెగా హీరోయిన్‌గా నిహారిక ప‌రిచ‌యం అయింది. ఇక కొన్నాళ్ళుగా సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా హీరోగా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కావాల‌ని అనుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని సబ్జెక్ట్ లు కూడా వినడం జరిగింది. ఈ రోజు వైష్ణ‌వ్ తేజ్ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు.

ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించగా.. అల్లు అర్జున్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ తదితరులు స్క్రిప్ట్‌ను అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సుకుమార్ కథను అందించనున్నారు. వైష్ణవ్ తేజ్ గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా నటించాడు. జానీ సినిమాలో చిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గా కూడా న‌టించాడు. ఈ కుర్రాడు ఓ వైపు తన చదువును కొనసాగిస్తూనే మరో వైపు నటన,డ్యాన్స్ ,ఫైట్స్ ఇలా అన్ని కేటగిరీల్లో శిక్షణ పొందాడు. తొలి సినిమా విషయంలో ఇప్పటికే మెగా హీరోల సలహ తీసుకుంటున్న వైష్ణవ్ తేజ్ త‌న డెబ్యూ మూవీతో ఎంత‌గా అల‌రిస్తాడో చూడాలి.
4576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles