వెంకీ సెంటిమెంట్ వాల్మీకికి వ‌ర్క‌వుట్ అవుతుందా ?

Sat,September 14, 2019 08:55 AM

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రించే న‌టుల‌లో వెంక‌టేష్ ఒక‌రు. ఆయ‌న ప్ర‌స్తుతం వెంకీమామ చిత్రంతో బిజీగా ఉన్నారు. అంత‌క‌ముందు ఎఫ్‌2 అనే చిత్రంలో వ‌రుణ్‌తేజ్‌తో క‌లిసి ప్రేక్ష‌కుల పొట్ట‌లు చెక్క‌ల‌య్యేలా న‌వ్వించాడు. ఇందులో వెంకీ ఆస‌నం అనే ఒక కొత్త‌ ఆస‌నం కూడా త‌న అభిమానుల‌కి ప‌రిచ‌యం చేశాడు. అయితే ఇప్పుడు విక్ట‌రీ వెంకటేష్‌.. వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న వాల్మీకి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా రానున్నారు. ఈ నెల 15న శిల్పా క‌ళా వేదిక‌లో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ మ‌ధ్య కాలంలో జ‌రిగిన చిత్ర వేడుక‌ల‌కి వెంకీ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైతే ఆ సినిమాల‌న్నీ మంచి విజ‌యం సాధించాయి. మ‌హ‌ర్షి, ఓ బేబి, జెర్సీ, మ‌జిలి ఇలా ప‌లు చిత్రాల ప్రీ రిలీజ్ వేడుక‌ల‌కి వెంకీ ముఖ్య అతిధిగా హాజ‌రై చిత్ర విజ‌యంలో పాలు పంచుకున్నారు. మ‌రి వాల్మీకి చిత్రానికి కూడా వెంక‌టేష్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు కానుండ‌డంతో సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్ధాం. వాల్మీకి చిత్రం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, సెప్టెంబ‌ర్ 20న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

1266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles