వ‌రుణ్ తేజ్ వాల్మీకి టీజ‌ర్‌కి టైం ఫిక్స్

Tue,August 13, 2019 11:01 AM
Valmiki teaser time fixed

మెగా హీరో వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీకి అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ సూప‌ర్ హిట్ జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే చిత్రంలో వ‌రుణ్ లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇది ఫ్యాన్స్‌లో సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది. తాజాగా ఆగ‌స్ట్ 15న‌ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్. ఇందులో వ‌రుణ్ లుక్స్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంద‌నే అభిప్రాయానికి వ‌స్తున్నారు అభిమానులు. మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ చిత్రాన్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేర్చేందుకు ఇందులో ఒక ఐట‌మ్ సాంగ్‌ని కూడా పెడుతున్నారు. ఈ ఐట‌మ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. ఈ అమ్మాయి ప్రభుదేవ, తమన్నాలు నటించిన ‘దేవి-2’లో కీల‌క పాత్ర పోషించింది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles