అనుష్క చిత్రానికి స‌రికొత్త టైటిల్

Fri,December 28, 2018 08:58 AM
variety title for anushka movie

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన అనుష్క భాగ‌మ‌తి చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుంది.త్వ‌ర‌లో థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌నుండ‌గా, ఈ చిత్రానికి కోన వెంకట్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మూవీ చిత్రీక‌ర‌ణ ఎక్కువ శాతం అమెరికాలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ న‌టులు కూడా న‌టిస్తార‌ని స‌మాచారం. హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న థ్రిల్లర్ మూవీ లో అనుష్క , మాధవన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు. ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. తెలుగు త‌మిళ భాష‌ల‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నటుడు సుబ్బరాజు కూడా చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

2196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles