బయోపిక్ ప్రకటించిన వర్మ..పోస్టర్ లుక్

Mon,April 1, 2019 08:01 PM
Varma announces Sasikala biopic here is the poster


లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు వర్మ. ‘శశికళ..లవ్ ఈజ్ డేంజరస్ పొలిటికల్’ అనేది శీర్షిక.


‘ఈ సినిమా ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో మీ ముందుకు రాబోతుందని’ ట్వీట్ చేసిన వర్మ..శశికళ, జయలలిత పక్కపక్కనే కూర్చొని ఉన్న పోస్టర్‌ను షేర్‌చేశాడు. దయలేని పురుషులు, జైళ్లకు మన్నార్‌గుడి గ్యాంగ్‌కు మధ్య రిలేషన్‌షిప్ నేపథ్యంలో సినిమా తీస్తున్నట్లు పోస్టర్ ద్వారా చెప్పాడు వర్మ. అయితే సినిమా నటీనటుల వివరాలు వెల్లడించలేదు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.6551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles