ప్రియాంక హెయిర్‌స్టైల్‌పై వ‌ర్మ కామెంట్

Wed,May 8, 2019 11:00 AM

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌, కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్ నిర్వ‌హించిన మెట్‌గాలా ఈవెంట్‌కి ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త నిక్ జోనాస్‌తో క‌లిసి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. వేడుక‌లో ప్రియాంక చోప్రా పిచ్చుక గూడు లాంటి హెయిర్ స్టైల్‌తో సిల్వ‌ర్ గౌను ధ‌రించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆమె డ్రెస్‌పై నెటిజ‌న్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక సంచ‌ల‌నాల‌తో ఎప్పుడు వార్త‌ల‌లో నిలిచే రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ప్రియాంక హెయిర్ స్టైల్‌పై స్పందించారు.

వీర‌ప్ప‌న్ మీసం కింద ప్రియాంక జుట్టుని సెట్ చేసి ఆ ఫోటోని త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేస్తూ .. ఎంతో పాపుల‌ర్ అయిన ఆ మీసంక‌ట్టుకింద ఈ హెయిర్ స్టైల్ స‌రిగ్గా స‌రిపోయింది. వీర‌ప్ప‌న్ మీసం స్టైల్‌లో ప్రియాంక హెయిర్‌ని సెట్ చేసిన ఆ హెయిర్ స్టైలిస్ట్‌కి వ్య‌క్తిగ‌తంగా సెల్యూట్ చేస్తున్నాను. ఐ ల‌వ్ ఇట్. ఆ హెయిర్ స్టైల్ నాకు ఎందుకు న‌చ్చిందో త‌ర్వాత వివ‌రిస్తాన‌ని వ‌ర్మ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. గ‌త ఏడాది జ‌రిగిన మెట్‌గాలా ఈవెంట్‌లోను ప్రియాంక చోప్రా వెరైట్ కాస్ట్యూమ్స్ ధ‌రించి వార్త‌ల‌లోకి ఎక్కింది

2910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles