‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో లక్ష్మీపార్వతి, చంద్ర‌బాబుని చూశారా?

Fri,January 11, 2019 08:19 PM
Varma introduced the Laxmi Parvathi,Chandrababu Naidu Roles in Lakshmi�s NTR

హైదరాబాద్‌: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌ను డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్‌ వర్మ శుక్రవారం విడుదల చేశారు. సినిమాలో కన్నడ నటి యజ్ఞా శెట్టి టైటిల్‌ పాత్రలో కనిపించనున్నట్లు ట్విట‌ర్‌లో పేర్కొన్నారు. ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాలో వీర‌ప్ప‌న్ భార్య‌గా న‌టించిన య‌జ్ఞాను ఇప్పుడు ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర కోసం తీసుకొచ్చాడు వ‌ర్మ‌. ఆ త‌ర్వాత సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ విడుదల చేశారు. ప‌లు ఫొటోల‌ను పోస్ట్ చేసి.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఈయ‌న ఏ పాత్ర చేస్తున్నాడో చెప్ప‌గ‌ల‌రా? అంటూ ఆర్జీవి అభిమానుల‌ను అడిగాడు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటల్ని ఆయన విడుదల చేశారు. ఈనెల‌ 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

5674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles