న‌మ‌స్తే తెలంగాణ కార్టూనిస్టు కార్టూన్ షేర్ చేసిన వ‌ర్మ‌

Fri,March 29, 2019 01:52 PM

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ .. ల‌క్ష్మీ పార్వ‌తి దృష్టి కోణం నుండి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ లభిస్తున్నది. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగింది, పార్టీ ప‌గ్గాల‌ని ఏ ప‌రిస్థితుల‌లో పోగొట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది, కుటుంబ స‌భ్యులు ఎందుకు ఎదురు తిర‌గ‌వ‌ల‌సి వ‌చ్చింది త‌దిత‌ర అంశాల‌ని త‌న‌దైన శైలిలో చూపించారు వ‌ర్మ‌. వెన్నుపోటు ద్వారా అంతమొందించబడ్డ ఎన్టీఆర్ మ‌రోసారి వెన్నుపోటుకి గుర‌య్యార‌ని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. 'న‌మ‌స్తే తెలంగాణ‌ కార్టూనిస్ట్' మృత్యుంజ‌య వేసిన కార్టూన్‌ని షేర్ చేస్తూ హిస్ట‌రీ రిపీట్స్ అనే కామెంట్ పెట్టాడు వ‌ర్మ‌. అందుకు కార‌ణం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి స‌ర్టిఫికెట్ అందుకున్న‌ప్ప‌టికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విడుద‌ల కానివ్వ‌కుండా కొన్ని శక్తులు అడ్డుప‌డ్డాయ‌ట‌.


ఒక పౌరుడిగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవిస్తూనే.. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్తామని వ‌ర్మ స్ఫ‌ష్టం చేశారు. అయితే వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో తెలుగు దేశం స్థాపించ‌బ‌డ్డ రోజే (మార్చి 29,1982) త‌న సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కూడా విడుద‌ల‌క కావ‌డం యాదృచ్చికంగా ఉంద‌ని అన్నాడు. అలానే 1989 లో అక్కినేని శివ, 2019 లో నందమూరి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని మ‌రో ట్వీట్ పెట్టాడు. ప్ర‌స్తుతం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి అంత‌టా విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.


'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' రివ్యూ
5340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles