'వ‌ర్మ' ట్రైల‌ర్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్

Thu,January 10, 2019 08:20 AM
VARMAA Official Trailer  released

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో సందీప్ వంగా తెర‌కెక్కించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ మూవీ త‌మిళంతో పాటు హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ టైటిల్ తో చిత్రం రూపొందుతుంది. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాసారు.ఆ మ‌ధ్య చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా 50 గంట‌ల‌లో 5 మిలియ‌న్ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఇక తాజాగా సూర్య చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల చేయించారు.

15 గంట‌ల‌లో చిత్ర ట్రైలర్ మిలియ‌న్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. హీరో లైఫ్ లోని వివిధ కోణాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రొమాన్స్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. దాదాపు తెలుగు వ‌ర్షెన్ మాదిరిగానే త‌మిళ వ‌ర్షెన్ అనిపిస్తుంది. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయం సాధించడంతో తమిళంలోను ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మేఘ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఈశ్వరీరావు ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అర్జున్ రెడ్డి హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ అవుతుండ‌గా, ఇందులో షాహిద్ క‌పూర్, కియారా అద్వానీలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

3898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles