త్వరలో పెళ్లిపీటలెక్కనున్న వరుణ్‌ ధవన్‌.. బీచ్‌లో పెళ్లట..!

Wed,May 22, 2019 06:03 PM
Varun Dhawan And Natasha Dalal to get married in December

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధవన్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారట. అది కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌. ఎక్కడో తెలుసా? బీచ్‌లో.. అవును.. వరుణ్‌, తన ప్రేయసి నటాశా దలాల్‌ పెళ్లి ఈ సంవత్సరం డిసెంబర్‌లో జరగనుందట. సోషల్‌ మీడియాలో వీళ్ల పెళ్లి గురించే ప్రస్తుతం చర్చ. పింక్‌విల్లా కథనం ప్రకారం.. వీళ్లు ఈ సంవత్సరం డిసెంబర్‌లో బీచ్‌లో పెళ్లి చేసుకోబోతున్నారట. వాళ్ల ఫ్యామిలీ దగ్గరి వ్యక్తులు పింక్‌విల్లాకు వరుణ్‌ వెడ్డింగ్‌ గురించి వెల్లడించారట.

వరుణ్‌, నటాశా కుటుంబాలు ఈ సంవత్సరం చివర్లో వాళ్ల పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారట. గోవాలోని ఓ బీచ్‌లో వీళ్ల పెళ్లి జరగనుందట. అయితే వీళ్ల పెళ్లిపై ఇప్పటి వరకు వరుణ్‌ కానీ.. నటాశా కానీ స్పందించలేదు. అధికారికంగా వాళ్ల ఫ్యామిలీ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పింక్‌విల్లా కథనాన్నే సినీ అభిమానులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

వాళ్ల పెళ్లికి బంధువులు, దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారట. పెళ్లి తర్వాత ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరపాలని ప్లాన్‌ చేస్తున్నారట. వరుణ్‌, నటాశా ఇద్దరు చాలాసార్లు పబ్లిక్‌గా కనిపించారు. వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని చాలా పుకార్లు వచ్చినప్పటికీ.. కరణ్‌ జోహార్‌ టాక్‌ షో కాఫీ విత్‌ కరణ్‌లో నటాశాతో తనకున్న రిలేషన్‌షిప్‌ గురించి వరుణ్‌ నోరు విప్పారు. నేను తనతో డేట్‌ చేస్తున్నా. మీమిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. అని వరుణ్‌ ఆ షోలో ప్రకటించారు.

వరుణ్‌ ధవన్‌.. ఇటీవలే కళంక్‌ సినిమాలో నటించారు. అయితే.. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. కళంక్‌లో వరుణ్‌ సరసన అలియా భట్‌ నటించింది. ప్రస్తుతం స్ట్రీట్‌ డ్యాన్సర్‌, రెమో డిసౌజ్‌తో త్రీడీ డ్యాన్స్‌ సినిమాలో వరుణ్‌ నటిస్తున్నారు. త్రీడీ డ్యాన్స్‌ సినిమాలో వరుణ్‌ సరసన శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది.

2633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles