'స్త్రీ' సీక్వెల్‌లో యంగ్ హీరో..!

Fri,April 5, 2019 11:18 AM
Varun Dhawan to replace Rajkummar rao

మంచి క‌థ, క‌థ‌నం ఉన్న సినిమాలకి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆ చిత్రానికి సంబంధించి సీక్వెల్ తెర‌కెక్క‌డం లేదంటే అదే చిత్రాన్ని వేరే భాష‌లో రీమేక్ చేయ‌డం వంటివి చేస్తుంటారు. స్త్రీ చిత్రం రాజ్ కుమార్ రావు, శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో హ‌ర‌ర్ కామెడీ చిత్రంగా తెర‌కెక్కింది. ఈ చిత్రం బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఓ స్త్రీ రేపు రా అని ప్రతి ఇంటి ముందు రాసి ఉంటుంది. రాత్రి పూట ఓ ఆడ దయ్యం వచ్చి యువ‌కుల‌ను ఎత్తుకెళ్లుతుందన్న భయం ఆ ఊళ్లో ఉంటోంది. 1980 దశకంలో ఇలాంటి సందర్భాలు కొన్ని రాష్ట్రాల‌లో ఎదురయ్యాయి. అయితే ఆ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అమర్ కౌషిక్ ఈ సినిమాను డైరక్ట్ చేశాడు. ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయ‌నున్నార‌ని ఇందులో నిహారిక న‌టించ‌నున్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం బాలీవుడ్‌లో స్త్రీ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నార‌ట‌. ఇందులో తొలిపార్ట్‌లో న‌టించిన రాజ్‌కుమార్ రావు స్థానంలో వ‌రుణ్ ధావ‌న్‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. వ‌రుణ్ ధావ‌న్ ప‌ర్‌ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది కాబ‌ట్టి ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో చిత్రాన్ని చేయాల‌నుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles